చంద్రయాన్-1 డేటా సాయంతో… జాబిల్లిపై నీటి ఆనవాళ్లు గుర్తించిన శాస్త్రవేత్తలు

చంద్రుడిపై గతంలో గుర్తించిన మంచు రూపంలో ఉన్న నీటి వనరులను (Water Resources) విశ్లేషణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలి లూనార్ మిషన్ (ISRO First Lunar Mission) చంద్రయాన్-1 (Chandrayaan-1) డేటా సహకరించింది. మనోవాలోని హవాయి యూనివర్సిటీ (Hawaii University) ప్లానెట్రీ శాస్త్రవేత్త షుయ్ లీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం చంద్రయాన్-1 మూన్ మినరాలజీ మ్యాపర్ (Moon Minerology Mapper) పరికరం ద్వారా సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను విశ్లేషించింది. చంద్రునిపై నీటి సాంద్రత, పంపిణీ,, దాని నిర్మాణం, పరిణామాన్ని అవగాహన చేసుకోవడం.. భవిష్యత్తులో మానవ అన్వేషణకు నీటి వనరులను అందించడం కీలకమని లీ బృందం నిర్దారణకు వచ్చింది. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను నేచర్ ఆస్ట్రానమీలో జర్నల్‌లో ప్రచురించారు.

‘లీ నేతృత్వంలోని కీలకమైన ఈ పరిశోధన.. చంద్రుడిపై వాతావరణ ప్రక్రియలకు దోహదం చేసే భూమి ప్లాస్మా షీట్‌లోని అధిక శక్తి ఎలక్ట్రాన్లు.. మాగ్నెటోస్పియర్‌లోని చార్జ్డ్ కణాల ప్రాంతం.. అయస్కాంత క్షేత్రం ద్వారా నియంత్రించే భూమి చుట్టూ ఉన్న ప్రదేశాలను గుర్తించింది. ఈ ఉపరితలం, ఎలక్ట్రాన్లు జాబిల్లి ఉపరితలంపై నీరు ఏర్పడటానికి సహాయపడి ఉండొచ్చు అని నిర్దారణకు వచ్చింది’ అని యూనివర్సిటీ ఆఫ్ హవాయి ఒక ప్రకటనలో తెలిపింది.

మాగ్నెటోస్పియర్ భూమిని అంతరిక్ష వాతావరణం.. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్ నుంచి రక్షిస్తుంది. సౌర గాలులను మాగ్నెటోస్పియర్‌ నెట్టివేసి.. రాత్రివేళలో పొడవైన తోకను పునర్నిర్మిస్తుంది. ఈ మాగ్నెటోటైల్‌లోని ప్లాస్మా షీట్ అనేది భూమి, సౌర గాలి నుంచి లభించే అధిక శక్తి ఎలక్ట్రాన్‌లు, అయాన్‌లతో కూడిన ప్రాంతం.

‘గతంలో శాస్త్రవేత్తలు ప్రధానంగా చంద్రుడు, ఇతర వాయురహిత వస్తువుల అంతరిక్ష వాతావరణంపై అధిక శక్తి అయాన్ల పాత్రపై దృష్టి సారించారు.. ప్రోటాన్ల వంటి అధిక శక్తి కణాలతో కూడిన సౌర గాలి… చంద్రుని ఉపరితలంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. ఇది జాబిల్లి ఉపరితలంపై నీరు ఏర్పడిన ప్రాథమిక మార్గాలలో ఒకటిగా భావించారు’ అని వర్సిటీ పేర్కొంది.

భూమి మాగ్నెటోటైల్‌లో ఆక్సిజన్‌.. చంద్రుని ధ్రువ ప్రాంతాలను ప్రభావితం చేస్తుందన్న గత పరిశోధనపై ఆసక్తి పెంచుకున్న లీ తాజా అధ్యయనం చేపట్టారు. ‘ఇది చంద్రుని ఉపరితల నీటి నిర్మాణ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి సహజ ప్రయోగశాలను అందించింది… చంద్రుడు మాగ్నెటోటైల్ వెలుపల ఉన్నప్పుడు.. దాని ఉపరితలం సౌర గాలుల ప్రభావంతో పేలుతుంది. మాగ్నెటోటైల్ లోపల, దాదాపు సోలార్ విండ్ ప్రోటాన్‌లు లేవు.. నీటి నిర్మాణం దాదాపు సున్నాకి పడిపోతుందని అంచనాకు వచ్చాం’ మనోవా స్కూల్ ఆఫ్ ఓషన్ అండ్ ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకుడైన లీ చెప్పారు.

లీ, అతడి సహచరులు చంద్రయాన్-1 మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం 2008,2009లో పంపిన రిమోట్ సెన్సింగ్ డేటాను విశ్లేషించారు. ప్లాస్మా షీట్‌ను కలిగి ఉన్న భూమి మాగ్నెటోటైల్ ద్వారా చంద్రుడు ప్రయాణించేటప్పుడు నీటి నిర్మాణంలో మార్పులను ప్రత్యేకంగా అంచనా వేశారు. తమ విశ్లేషణలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయని లీ పేర్కొన్నారు.

‘భూమి మాగ్నెటోటైల్‌లో నీరు ఏర్పడటం.. దాని వెలుపల చంద్రుడు ఉన్న సమయానికి దాదాపు సమానంగా ఉంటుందని రిమోట్ సెన్సింగ్ పరిశీలనలు చూపాయి.. మాగ్నెటోటైల్‌లో అదనపు నిర్మాణ ప్రక్రియలు లేదా కొత్త నీటి వనరులు సోలార్ విండ్ ప్రోటాన్‌ల ఇంప్లాంటేషన్‌తో నేరుగా సంబంధం కలిగి ఉండొచ్చని ఇది సూచిస్తుంది. ప్రత్యేకించి,అధిక శక్తి ఎలక్ట్రాన్‌ల ద్వారా వచ్చే రేడియేషన్ సౌర పవన ప్రోటాన్‌ల మాదిరిగానే ప్రభావాలను ప్రదర్శిస్తుంది’ అని లీ తెలిపారు.

మొత్తంగా ఈ పరిశోధన.. గతంలో చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో అన్వేషణలో గుర్తించని అనేక అంశాలు.. భూమి, చంద్రునితో బలంగా ముడిపడి ఉందని సూచిస్తున్నాయని లీ వ్యాఖ్యానించారు.

Read More Latest Science & Technology News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *