నానబెట్టిన పల్లీలను తింటే ఎంత మంచిదో తెలుసా?

డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టడం వల్ల వాటిలోని పోషక విలువలు రెట్టింపు అవుతాయి. అయితే బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను మాత్రమే నానబెడుతుంటారు. కానీ పల్లీలను కూడా నానబెట్టి తినొచ్చు. ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

  బాదం పప్పులను నానబెట్టి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్న ముచ్చట చాలా మందికి తెలుసు. అందుకే వీటిని నానబెట్టే ఎక్కువగా తింటుంటారు. కానీ పల్లీలను తినడం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. పల్లీలను ఇలా నానబెట్టి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. అలాగే పల్లీలను నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  పల్లీలను నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. అయితే పల్లీల తొక్కలల్లో ఫైటేట్లు, ఆక్సలేట్ లు ఉంటాయి. ఇవి కూడా పోషకాలే. కానీ ఇవి బి-విటమిన్లను శరీరం సరిగా గ్రహించబడకుండా అడ్డుపడతాయి. అదే పల్లీలను నానబెట్టడం వల్ల ఈ ఫైటేట్ల ప్రభావాలు తగ్గుతాయి. దీంతో ఇవి చాలా సులువుగా జీర్ణమవుతాయి. నానబెట్టడం వల్ల డ్రై ఫ్రూట్ లో ఉండే ప్రోటీన్ పాక్షికంగా జీర్ణమవుతుంది. అందుకే వీటిని తినడానికి ముందు నానబెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన పల్లీలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జీర్ణక్రియను మెరుగుపర్చడానికి..

పల్లీలను నానబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. ఫైటిక్ ఆమ్లం కూడా  ఒక పోషకమే. అయితే ఇది కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలను శరీరం గ్రహించకుండా అడ్డుపడుతుంది. అయితే వీటిని నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లం తగ్గుతుంది. పల్లీల్లోని పోషకాలను జీర్ణక్రియ, శోషణను ఇది పెంచుతుంది. 

పోషకాలను బాగా గ్రహించడం..

పల్లీలను నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లం తగ్గుతుంది. దీంతో వేరుశెనగలోని ముఖ్యమైన ఖనిజాల శోషణ కూడా మెరుగుపడుతుంది. ఇది గింజల్లో ఉండే మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజాలను శరీరం బాగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. మంచి పోషణ శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. 

  అలర్జీలను తగ్గిస్తుంది

కొంతమందికి పల్లీలను తినడం వల్ల అలెర్జీ సమస్య వస్తుంది. అయితే వీటిని నానబెట్టి తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశం తగ్గుతుంది. పల్లీల్లో ఉండే కొన్ని రకాల ప్రోటీన్ల వల్ల కూడా చాలా మందికి అలెర్జీ వస్తుంది. అయితే ఈ గింజలను నానబెట్టడం వల్ల అలెర్జీ ప్రతిచర్యల ప్రమాదం తగ్గుతుంది. 

  పోషక లోపాలు

ఫైటిక్ ఆమ్లంతో పాటుగా పల్లీల్లో లెక్టిన్లు వంటి ఇతర యాంటీ-పోషకాలు కూడా ఉంటాయి. పల్లీలను నానబెట్టడం వల్ల ఈ సమ్మేళనాల స్థాయిలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థకు పల్లీలను సులువుగా అరిగించేందుకు సహాయపడుతుంది. 

పల్లీలను ఎలా నానబెట్టాలి?

ముందుగా కొన్ని పల్లీలను తీసుకుని ఒక గిన్నెలో వేయండి. ఈ పల్లీలు మునిగేంత వరకు నీటిని పోయండి. కావాలనుకుంటే మీరు ఈ నీళ్లలో చిటికెడు ఉప్పు ను కలపొచ్చు. వీటిని కొన్ని గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టండి. మీరు పొద్దున కూడా నానబెట్టొచ్చు. కానీ వీటిని 4 నుంచి 12 గంటల వరకు నానబెట్టాలి. ఇక ఇవి నానిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. 

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *