నీ చెత్త కెప్టెన్సీ వల్లే ఓడిపోయారు! రోహిత్‌, బాబర్ ఆజమ్‌ మధ్య అదే తేడా… గౌతమ్ గంభీర్ కామెంట్స్..

ఆసియా కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా అడుగుపెట్టింది పాకిస్తాన్. వన్డే నెం.1 టీమ్‌గా ఆసియా కప్ ఆరంభించిన పాకిస్తాన్, సూపర్ 4 స్టేజీలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి… ఆసియా కప్ 2023 ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది…

  నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం అందుకుంది పాకిస్తాన్. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 151 పరుగులతో చెలరేగిపోయాడు. గ్రూప్ స్టేజీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది..

లాహోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో విక్టరీ అందుకున్న పాకిస్తాన్… ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. టీమిండియాతో మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాక్, శ్రీలంకతో మ్యాచ్‌నీ కాపాడుకోలేకపోయింది. 

  తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 252 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 252 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో పాకిస్తాన్ విఫలమైంది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న శ్రీలంక, ఆసియా కప్ 2023 ఫైనల్ ఆడనుంది..

‘నా ఉద్దేశంలో బాబర్ ఆజమ్ చెత్త కెప్టెన్సీ వల్లే పాకిస్తాన్ ఓడిపోయింది. ఆఖరి ఓవర్లలో శ్రీలంక లక్ష్యానికి దగ్గరగా వస్తున్నప్పుడు బాబర్ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. బౌండరీలు రాకుండా ఫీల్డింగ్ సెట్ చేయలేకపోయాడు..

జమాన్ ఖాన్ ఓవర్‌లో ఫోర్ వెళ్లింది, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లోనూ ఫోర్ వెళ్లింది. ఈ రెండు బాల్స్ కూడా స్లోవర్ బాల్స్. బౌలర్లు స్లో బాల్స్ వేస్తున్నప్పడు ఫీల్డర్లను మిడ్ ఆఫ్, లాంగ్ ఆఫ్‌లో పెట్టి థర్డ్ మ్యాన్‌ని తీసుకురావాలి. కానీ బాబర్ ఆజమ్ మాత్రం బౌండరీల దగ్గరే కాపలా పెట్టినట్టు పెట్టాడు..

ఆఖరి ఓవర్‌లో 12-13 పరుగుల టార్గెట్ ఉండి ఉంటే, లంక బ్యాటర్ల మీద ప్రెషర్ ఉండేది. ఓ స్టేజీ తర్వాత మ్యాచ్ పోయిందని బాబర్ ఆజమ్ కూడా ఫిక్స్ అయిపోయాడు. కేవలం ఆరుగురు బౌలర్ల కోటా పూర్తి చేయాలన్నట్టుగా బౌలింగ్ మార్పులు చేశాడు..

బౌలర్లను మారుస్తూ పోతే వికెట్లు పడతాయని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. టీ20ల్లో కంటే వన్డేల్లో బాబర్ ఆజమ్ బెటర్ కెప్టెన్ అనుకున్నా. కానీ వన్డేల్లో కూడా అతని కెప్టెన్సీ నాకు చాలా చాలా ఆర్డినరీగా అనిపించింది…

  ఇదే శ్రీలంకపై టీమిండియా, 214 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీకి, బాబర్ ఆజమ్ కెప్టెన్సీకి ఇదే తేడా. స్వల్ప లక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసినవాళ్లే గొప్ప కెప్టెన్ అవుతారు.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. 

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *