బ్రతికి ఉన్న కూతురుకి పెద్ద కర్మ చేసిన తండ్రి..!

చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసిన కూతురికి బ్రితికి ఉండగానే ఓ తండ్రి పెద్ద కర్మ చేసారు. ఓ ప్లేక్సి వేసి మరిపెద్ద కర్మ నిర్వహించారు. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad District) లో చోటు చేసుకుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన ఓ తండ్రి తన కూతురు నందినిని అల్లారు ముద్దుగా పెంచారు. విద్యాబుద్దులు నేర్పించారు. కూరుతు పెళ్లిని తన ఇష్టప్రకారంగా అరెంజ్ మ్యారేజ్ చేసారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంలో కనుల విందుగా వివాహం జరిపించారు. అంతా సవ్యంగా జరిగింది. పెళ్లి అయిన తరవాత పెళ్లి కొడుకుకు బోన్ క్యాన్సర్ ఉందని పెళ్లి కూతురు నందినికి తెలిసింది.

దీంతో వెంటనే పుట్టింటికి వచ్చేసింది. తను ప్రేమించిన యువకుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దీంతో ఆగ్రహించిన తండ్రి తన కూతురు చనిపోయిందని ఫ్లెక్సీ వేయించి పెద్దకర్మ నిర్వహించారు. నిజంగానే చనిపోయిందని బంధువులు సైతం వచ్చారు. తీరా వచ్చి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కూతురు కోసం ఎంతో చేసిన తండ్రి, తాను చేసిన పెళ్లి పెటాకులు అవ్వడం, మరోవైపు కూతురు తాను ప్రేమించిన యువకునితో కలిసి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక ఇంతకు తెగించాడు.

కూతురు చేసిన పనికి తండ్రి పెద్ద కర్మ నిర్వహించడాన్ని బంధువులు అశ్చర్యంగా చూసారు. ఏది ఏమైనా తండ్రి తన కూతురుపై ఉన్న ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఇలా తన కొపాన్ని తీర్చుకున్నాడని స్థానికులు బావిస్తున్నారు. కూతురు తాను ప్రేమించిన వ్యక్తి గురించి తండ్రికి చెప్పి, ఒప్పించి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదని స్థానికులు అంటున్నారు. పిల్లలు కూడా ఒక్క క్షణం కనిపెంచిన తల్లి దండ్రుల గురించి ఆలోచించాల్సిన ఆవసరం ఎంతైనా ఉందని ఇలాంటి ఘటనలు నిరూపిస్తుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *