ఒక్కొక్కరూ ఒక్కోలా నిద్రపోతారు. మనం నిద్రపోయిన తర్వాత మనం ఏ పొజీషన్ లో పడుకుంటామో తెలియదు. కానీ మనం నిద్రపోయే పొజీషన్స్ కూడా మన గురించి ఎన్నో సీక్రేట్స్ ను తెలియజేస్తాయి తెలుసా?
సాధారణం మనం ఈ పొజీషన్ లో నిద్రపోతున్నామో అస్సలు చూసుకోం. నిజమేంటంటే.. నిద్రలోకి జారుకున్న తర్వాత మనం రెగ్యులర్ గా పడుకునే పొజీషన్ లో ఉంటాం. అయితే మనం నిద్రపోయే విధానం కూడా మన గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తుంది తెలుసా? మీరు ఏ స్లీపింగ్ పొజీషన్ లో నిద్రపోతున్నారో తెలుసుకుంటే మీ గురించి మీరే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఒక అధ్యయనం ప్రకారం.. 70 శాతం మంది రాత్రిళ్లు ఒకే పొజీషన్ లో పడుకుంటారు. ఒక రోజు కాదు.. ఇది ఒక అలవాటు. కానీ మీరు దీన్ని గమనించి ఉండకపోవచ్చు. అసలు ఎలా పడుకుంటే.. మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దిండు పట్టుకుని పడుకోవడం
కొంతమంది నిద్రపోయేటప్పుడు దిండును కౌగిలించుకుని పడుకుంటారు. నిపుణుల ప్రకారం.. ఇలాంటి వారు ఎంతో ప్రేమగా ఉంటారు. అలాగే తమ జీవితంలో రిలేషన్ షిప్స్ కు ఎంతో ప్రముఖ్యతను ఇస్తారు. భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు.
చేతులు తలకింద పెట్టుకుని పడుకోవడం
చాలా మందికి తమ రెండు చేతులను తలకింద పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే వీరు ఎలాంటి భయాలు లేకుండా జీవిస్తారట. అంతేకాదు ఎవ్వరి గురించి తప్పుగా ఆలోచించరు. కానీ భావోద్వేగానికి లోనవుతారు.
చేతులు, కాళ్లు ముడుచుకుని పడుకోవడం
కాళ్లు, చేతులను ముడుచుకుని పడుకునే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది. అయితే ఇలా పడుకునే వారు ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక సర్వే ప్రకారం.. 41 శాతం మంది ఈ స్లీపింగ్ పొజీషన్ లోనే నిద్రపోతారు. ఇలాంటి వారికి ఎప్పుడూ ఒవరో ఒకరి మద్దతు అవసరం. అలాగే వీరు మానసికంగా అంత బలమైన వారు కాదు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా భయపడతారు.
కాళ్లు, చేతులు చాచి పడుకోవడం
కాళ్లు, చేతులు చాచి మరీ నిద్రపోతుంటారు కొంతమంది. అయితే ఇలా నిద్రపోయేవారు ఎంతో విశ్వసనీయంగా ఉంటారట. వీరి చేతులు తలవైపు, పాదాలు రెండు వైపులా విస్తరించి ఉంటాయి. వీళ్లు మంచి ఫ్రెండ్స్. వీరు నమ్మకంగా ఉంటారు. అలాగే ఇతరుల సమస్యలను ఎంతో శ్రద్ధగా వింటారు. వాటిని పరిష్కరించడానికి కూడా సహాయపడతారు. వీరు తమ జీవితంలోకి వ్యక్తులను ఆహ్వానిస్తారు.
కడుపుపై పడుకోవడం
ప్రీ స్టైల్ అంటే కడుపుపై పడుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. మీకు తెలుసా? ఇలా పడుకునే వారు ఎంతో చురుగ్గా ఉంటారట, అలాగే వీరు స్వేచ్ఛను ఇష్టపడతారట. వీళ్లు తమ జీవితంలో రిస్క్ తీసుకోవడానికి అస్సలు వెనకాడరు. అంతేకాదు వీళ్లు చాలా ఓపెన్ మైండెడ్ కూడాను.
జాగ్రత్తగా నిద్రపోవడం
కొంతమంది ఎంతో జాగ్రత్తగా నిద్రపోతుంటారు. అయితే ఇలాంటి వారు సమాజంలో తమ ఇమేజ్ గురించి ఎంతో జాగ్రత్తగా ఉంటారట. వీళ్లు రిజర్వ్డ్ స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు ఎంతో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాగే వీళ్లు తమపై ఎన్నో ఆశలను కూడా పెట్టుకుంటారు.