మొక్కజొన్నలంటే ఇష్టమా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

మొక్క జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.

  మొక్క జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.

  మొక్కజొన్న పంటను ప్రధానంగా పంజాబ్, హర్యానా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో పండిస్తారు.

  మొక్కజొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మొక్కజొన్నను తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. 

  మొక్కజొన్నల్లో లుటిన్, జియాక్సంతిన్ తో పాటుగా యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి, కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

  గుండె జబ్బులను దూరం చేయడానికి మొక్కజొన్న కూడా ఎంతో సహాయపడుతుంది. మొక్కజొన్నను తింటే రక్తహీనత సమస్య పోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

  మొక్కజొన్న బరువు తగ్గడానికి కూడా ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే వెయిట్ లాస్ డైట్ ను ఫాలో అయ్యే వారు వీటిని తీసుకుంటే మంచిది.  

  మన కళ్లు, జుట్టు, చర్మం ఆరోగ్యానికి ఐరన్ చాలా చాలా అవసరం. అయితే మొక్కజొన్నలో ఐరన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *