Heinrich Klaasen: జంపాకు కాలరాత్రి – సఫారీలకు రన్ ఫీస్ట్ – రికార్డుల మోత మోగించిన హెన్రిచ్ క్లాసెన్

Heinrich Klassen: ‘ఎవడైనా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు.. వీడెంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. అదేదో గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు, గోడ కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జి’ అంటూ అతడు  సినిమాలోని తనికెళ్లభరణి చెప్పిన ఈ డైలాగ్‌కు ప్రాక్టికల్ వెర్షన్ చూపించాడు  సఫారీ బ్యాటర్  హెన్రిచ్ క్లాసెన్.  దక్షిణాఫ్రికా పర్యటనలో  టీ20లతో పాటు వన్డే సిరీస్‌లోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న కంగారూలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు.  కంగారూ బౌలర్లందరినీ కసిగా బాదిన  క్లాసెన్.. ఆ జట్టు స్పిన్నర్ ఆడమ్ జంపాకు అయితే కాలరాత్రిని మిగిల్చాడు.  

మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌తో కలిసి  రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన దక్షిణాఫ్రికాను నాలుగో వన్డేలో  కమాండింగ్ పొజిషన్‌లో నిలిపాడు.   ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా  సెంచూరియన్ లోని  సూపర్ స్పోర్ట్ పార్క్‌లో  ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నాలుగో వన్డే  రికార్డులకు వేదికైంది.  83 బంతుల్లోనే ఏకంగా 174 పరుగులు చేసిన క్లాసెన్ విధ్వంసంలో  13 బౌండరీలు, 13 భారీ సిక్సర్లున్నాయి. 52 బంతుల్లో సెంచరీ చేసిన క్లాసెన్.. 77 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. అగ్నికి వాయువు తోడైనట్టుగా క్లాసెన్‌కు  డేవిడ్ మిల్లర్ జతకలిశాడు. మిల్లర్ కూడా 45 బంతుల్లో 6  ఫోర్లు, 5  సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు.  ఈ ఇద్దరి విధ్వంసంతో  దక్షిణాఫ్రికా.. నిర్ణీత 50‌ ఓవర్లలో  ఐదు వికెట్లు కోల్పోయి 416 పరుగులు చేసింది.  తర్వాత బ్యాటింగ్ చేసిన  ఆస్ట్రేలియా..  34.5 ఓవర్లలో  252 పరుగులకే ఆలౌట్ అయింది.  ఫలితంగా సఫారీలు 164 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-2 తో సమం చేశారు.  రికార్డులకు వేదికైన సెంచూరియన్ మ్యాచ్‌లో నమోదైన, బద్దలైన రికార్డుల గురించి ఇక్కడ చూద్దాం. 

రికార్డుల మోత.. 

400 ప్లస్ స్కోర్లు అత్యధికంగా చేసిన జట్లు 

– సౌతాఫ్రికా : 7

– ఇండియా : 6 

– ఇంగ్లాండ్ : 5

– ఆస్ట్రేలియా : 2 

వన్డేలలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్

– మిక్ లూయిస్  (ఆస్ట్రేలియా) – 10 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 113 పరుగులు (సౌతాఫ్రికాపై 2006లో)

– ఆడమ్ జంపా – 10 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 113  (20‌23)

– రషీద్ ఖాన్ – 9 ఓవర్లలో వికెట్లేమీ లేకుండా 110 (ఇంగ్లాండ్ పై 2019)

– వహబ్ రియాజ్ – 10 ఓవర్లలో వికెట్లేమీ లేకుండా 110 (ఇంగ్లాండ్‌పై 2016)

ఐదో స్థానంలో వచ్చి అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్లు

– కపిల్ దేవ్ : 175 నాటౌట్ (జింబాబ్వేపై 1983లో) 

– క్లాసెన్ : 174 (2023 ఆసీస్‌పై) 

– జకరన్ మల్హోత్ర : 173 నాటౌట్ (పపువా న్యూ గినియాపై 2021లో)

– లూక్ రాంచి : 170 నాటౌట్ (శ్రీలంకపై 2015లో) 

సౌతాఫ్రికా తరఫున ఫాస్టెస్ట్ హండ్రెడ్: 

– ఏబీ డివిలియర్స్ : 31 బంతుల్లో (విండీస్‌పై) 

– మార్క్ బౌచర్ : 44 బంతుల్లో (జింబాబ్వేపై)

– ఏబీ డివిలియర్స్ : 52 బంతుల్లో (విండీస్‌పై)

– క్లాసెన్ :  52 బంతుల్లో (విండీస్ పై) 

– ఏబీ డివిలియర్స్  : 57 బంతుల్లో (ఇండియాపై) 

– క్లాసెన్ : 57 బంతుల్లో (ఆసీస్‌పై)

ఆసీస్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ వీరులు.. 

– విరాట్ కోహ్లీ : 51 బంతుల్లో (2013) 

– హెన్రిచ్ క్లాసెన్ : 57 బంతుల్లో (2023) 

– విరాట్ కోహ్లీ : 61 బంతుల్లో (2013) 

– అలెక్స్ హేల్స్ : 62 బంతుల్లో (2018)

వన్డేలలో  ఫాస్టెస్ట్ 150 స్కోర్లు.. 

– ఏబీ డివిలియర్స్ : 64 బంతుల్లో 

– జోస్ బట్లర్ : 65 బంతుల్లో 

– జోస్ బట్లర్ : 76 బంతుల్లో 

– క్లాసెన్ : 77 బంతుల్లో

వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు.. 

– ఏబీ డివిలియర్స్ : 16 సిక్సర్లు (విండీస్‌పై) 

– క్లాసెన్ : 13 

– డివిలియర్స్ : 11 (ఇండియాపై)

– క్వింటన్ డికాక్ : 11 (ఆసీస్‌పై) 

వన్డేలలో  ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం.. 

– గ్రాంట్ ఎలాయిట్ – లూక్ రాంచి (కివీస్) : 267 (శ్రీలంకపై 2015లో) 

–  జెపి డుమిని – మిల్లర్ : 256 (జింబాబ్వేపై  2015) 

– రవి బొపారా – ఇయాన్ మోర్గాన్  : 226 (ఐర్లాండ్‌పై 2013లో) 

– మహ్మదుల్లా – షకిబ్ (బంగ్లాదేశ్) : 224 (కివీస్‌పై 2017) 

– అజారుద్దీన్ – అజయ్ జడేజా : 223 : (శ్రీలంకపై 1993) 

– క్లాసెన్ – మిల్లర్ : 222 (ఆసీస్‌పై 2023) 

– చివరి పది ఓవర్లలో   దక్షిణాఫ్రికా చేసిన స్కోరు : 173 పరుగులు.. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ (163 – నెదర్లాండ్స్‌పై) పేరిట ఉంది. 

– ఒక ఇన్నింగ్స్‌లో సఫారీ బ్యాటర్లు అత్యధిక సిక్సర్లు (20) కొట్టిన మ్యాచ్ ఇదే.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *