Motorola Edge 40 Neo | మోటరోలా ఎడ్జ్40 నియో ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?!

Motorola Edge 40 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. తన మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న మోటరోలా ఎడ్జ్40 నియో ఫోన్ ఆవిష్కరిస్తారు. గత ఏప్రిల్‌లో మోటరోలా ఎడ్జ్40, మోటరోలా ఎడ్జ్ 40 ప్రో ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

మోటరోలా ఎడ్జ్40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7030 ఎస్వోసీ (MediaTek Dimensity 7030 SoC) చిప్‌సెట్, 68 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.

మోటరోలా ఎడ్జ్40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్ మూడు కలర్స్ – బ్లాక్ బ్యూటీ, కనీల్ బే, సూథింగ్ సీ కలర్ వేస్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్నది. భారత్ మార్కెట్లో ఈ ఫోన్ ధర సుమారు రూ.35,400 (399 యూరోలు) ఉండొచ్చునని అంచనా. ప్రస్తుత ఆఫ్రికా మార్కెట్లు, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో లభ్యమవుతున్నది.

మోటరోలా ఎడ్జ్40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్ 6.55 -అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) పోలెడ్ డిస్ ప్లే విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఈ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ -3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంవైయూఎక్స్ ఓఎస్ (Android 13-based MyUX OS) వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది.

డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది మోటరోలా ఎడ్జ్40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సెన్సర్‌తో 13-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా వస్తుంది.

సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో వస్తుంది మోటరోలా ఎడ్జ్40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్. ఈ ఫోన్ 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *