Neha Shetty Tillu Square Movie : అందుకే నన్ను ‘DJ టిల్లు’ సీక్వెల్‌లో హీరోయిన్‌గా తీసుకోలేదు – నేహా శెట్టి

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలు బ్లాక్ బస్టర్ మూవీస్ కి కొనసాగింపుగా సీక్వెల్స్ చేసేవారు. ఇప్పుడు యువ హీరోలు సైతం ఈ సీక్వెల్ ట్రెండ్ లో జాయిన్ అయ్యారు. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి. ఆయన నటించిన ‘DJ టిల్లు’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఓ చిన్న సినిమాగా గత ఏడాది విడుదలైంది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square Movie) రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్లో సిద్దు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.

నిజానికి ‘DJ టిల్లు’లో సిద్ధు కి జోడిగా నేహా శెట్టి నటించింది. కానీ సీక్వెల్లో మాత్రం ఆమెను తీసుకోలేదు. సాధారణంగా సీక్వెల్స్ అంటే నటీనటుల్ని రిపీట్ చేస్తారు. సీక్వెల్లో కొత్తవాళ్లు జాయిన్ అవ్వడం కానీ, కొన్ని క్యారెక్టర్స్ ని యాడ్ చేయడం కానీ జరుగుతుంది. లీడ్ రోల్స్ మాత్రం అలాగే ఉంటాయి. కానీ ‘DJ టిల్లు’ సీక్వెల్ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. సీక్వెల్లో ఏకంగా హీరోయిన్ ని మార్చేశారు. నిజానికి ‘DJ టిల్లు’ మూవీకి ఆ రేంజ్ రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం హీరోయిన్ నేహా శెట్టి సినిమాలో పోషించిన రాధిక పాత్ర అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

టాలీవుడ్ లో ‘మెహబూబా’ అనే సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది నేహా శెట్టి. కానీ ఈమెకు ‘DJ టిల్లు’ విజయంతోనే ఇండస్ట్రీలో భారీ గుర్తింపు దక్కింది. సినిమాలో రాధిక పాత్రలో నేహా శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు సైతం ఫిదా అయిపోయారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అంతలా ఆకట్టుకున్న నేహా శెట్టి ‘DJ టిల్లు’ సీక్వెల్లో లేదని తెలిసి ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఆమె నటించకపోవడంపై అప్పట్లో చాలా రకాల వార్తలొచ్చాయి. హీరో సిద్దూతో నేహా శెట్టికి గొడవలు జరిగాయని, అందుకే ఆమె సీక్వెల్ నుంచి తప్పుకుందనే ప్రచారం జరిగింది.

Also Read : ఏవయ్యా అట్లీ – నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?

అయితే తాజాగా ఇదే ఇదే విషయం గురించి నేహా శెట్టి క్లారిటీ ఇస్తూ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “DJ టిల్లుకి, ‘టిల్లు స్క్వేర్’కి ఎలాంటి సంబంధం లేదు. టిల్లు స్క్వేర్ పూర్తిగా డిఫరెంట్ స్క్రిప్ట్. DJ టిల్లు కి ఈ మూవీ కొనసాగింపు కాదు.ఇది ప్రెష్ స్టోరీ. అందుకే నేను ‘టిల్లు స్క్వేర్’లో మూవీలో లేను. ఈ రోజు వరకు కూడా నన్ను చాలా మంది సిద్దును కలవమని, ‘DJ టిల్లు’ సీక్వెల్లో నటించమని మెసేజ్ ల రూపంలో అడుగుతూనే ఉన్నారు” అని చెప్పింది. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’ లో మీరు క్యామియో రోల్ లో నటిస్తున్నారా? అని అడిగినప్పుడు… “ఆ విషయం తెలుసుకోవాలంటే మీరు కొద్ది రోజులు వెయిట్ చేయాలి” అంటూ చెప్పుకొచ్చింది నేహా శెట్టి. దీంతో నేహా శెట్టి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read : 300 కోట్లు కాదు, అంత కంటే ఎక్కువే – ‘జవాన్‘ బడ్జెట్ ఎంతో రివీల్ చేసిన అట్లీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *