Ramcharitmanas | రామ్‌చ‌రిత్‌మాన‌స్‌పై మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

న్యూఢిల్లీ : బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖ‌ర్ (Ramcharitmanas) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రామ్‌చ‌రిత్‌మాన‌స్‌ను పొటాషియం సైనేడ్‌తో పోల్చుతూ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. హిందీ దివ‌స్ సంద‌ర్భంగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ మీకు 55 వంట‌కాలు వ‌డ్డించి, వాటిలో పొటాషియం సైనేడ్ క‌లిపితే మీరు తింటారా అని ప్ర‌శ్నిస్తూ హిందూ గ్రంధాలు కూడా ఇంతేన‌ని చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. బాబా నాగార్జున్‌, లోహియా వంటి ఎంతో మంది ర‌చ‌యిత‌లు ఆయా గ్రంధాల‌ను విమ‌ర్శించార‌ని పేర్కొన్నారు.

రామ్‌చ‌రిత్‌మాన‌స్‌పై త‌న అభ్యంత‌రాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, జీవితాంతం ఇదే అభిప్రాయంతో ఉంటాన‌ని, ఆరెస్సెస్ చీఫ్ మోఃహ‌న్ భ‌గ‌వ‌త్ సైతం దీనిపై కామెంట్ చేశార‌ని బిహార్ మంత్రి చెప్పారు. కుల వివ‌క్షలో మార్పు రాకుంటే దేశంలో రిజ‌ర్వేష‌న్లు, కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. మంత్రి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స్పందిస్తూ బిహార్ సీఎం నితీష్ కుమార్ లక్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించింది.

రామ్‌చ‌రిత్‌మాన‌స్‌పై మంత్రి చంద్ర‌శేఖ‌ర్ ప‌దేప‌దే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ఇవి సీఎం నితీష్ కుమార్ చెవికెక్క‌డం లేదా అని బీజేపీ ప్ర‌తినిధి నీర‌జ్ కుమార్ ప్ర‌శ్నించారు. నితీష్ కుమార్ అదేప‌నిగా స‌నాత‌న ధ‌ర్మాన్ని అవ‌మానిస్తున్నార‌ని అన్నారు. హిందూ మ‌తంతో ఆయ‌న‌కు ఏమైనా స‌మ‌స్య ఉంటే త‌న మ‌తాన్ని మార్చుకోవ‌చ్చ‌ని చంద్ర‌శేఖ‌ర్‌కు స‌ల‌హా ఇచ్చారు.

Read More :

Aditya-L1: విజ‌య‌వంతంగా నాలుగోసారి ఆదిత్య ఎల్‌1 క‌క్ష్య పెంపు

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *