Relationship: అబ్బాయిలూ.. అమ్మాయిలని ఆకర్షించాలంటే.. ఈ నైపుణ్యాలని పెంచుకోవాల్సిందే!

 Relationship: ఒక మగవాడు ప్రత్యేకమైన కొన్ని నైపుణ్యాలని కలిగి ఉండటం వలన  బంధాన్ని నిలబెట్టుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే అమ్మాయిలను ఆకర్షించడానికి కూడా అబ్బాయిలు కొన్ని నైపుణ్యాల్ని పెంచుకోవాలి. అవి ఏమిటో చూద్దాం.

   సమాజంలో ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కావాలని కోరుకుంటారు అలాగే భాగస్వామి దగ్గర కూడా ప్రత్యేకమైన స్థానం కోసం అనేక పనులు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాలలో అమ్మాయిలకి, అబ్బాయిలకి చాలా వ్యత్యాసం ఉంది. సాధారణ లక్షణాలను కలిగి ఉండే అబ్బాయిలను అమ్మాయిలను అంత త్వరగా ఇష్టపడరట.

అమ్మాయిలని ఆకర్షించుకోవడానికి అబ్బాయిలు కొన్ని నైపుణ్యాలని పెంచుకోవాలి. అదేమిటంటే వృత్తిపరంగా అయినా వ్యక్తిగతంగా అయినా ఇతరులతో మీ సంబంధాలను పటిష్టంగా నిలుపుకోవాలంటే మీకు వినగలిగే సామర్థ్యం ఎక్కువగా ఉండాలి.

  అవతలి వాళ్లు చెప్తున్న దాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం కలిగి ఉండాలి. అలా వినగలిగినప్పుడు ఎదుటి వారికి నీ గురించి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంకా మీకు ఆ సమస్యని తీర్చే నైపుణ్యం ఉంటే ఇంకా మంచిది. అలాంటి మగవాళ్ళ వెనుక అమ్మాయిలు తప్పకుండా పడతారు. అలాగే ప్రతి అబ్బాయికి కచ్చితంగా నాయకత్వ లక్షణం ఉండి తీరాలి.

   వ్యాపారంలో అయినా కుటుంబంలో అయినా మీరు నాయకత్వం వహించాల్సిన స్థాయి మీరు నడిపించే వారి సమిష్టి విజయాన్ని నిర్ణయిస్తుంది. నాయకత్వ లక్షణాలు ఉన్న మగవాడిని ఇష్టపడని ఆడవాళ్లు చాలా అరుదు. అలాగే సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో అటు సహోద్యుగులు ఇటు భాగస్వాములతోనూ చురుకుగా వ్యవహరించాలి.

 ఏ ఒక్కరి సహాయము లేకుండా ఏ స్థాయిలో కూడా విజయం సాధించలేరు. అందుకే చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళని మీతో కలిసి పోయేలాగా చేసుకునే నైపుణ్యం మిమ్మల్ని వ్యక్తిగా ఒక రేంజ్ లో నిల్చబడుతుంది. అలాగే ఆర్థిక విషయాలలో కూడా చక్కని ప్రణాళిక కలిగి ఉన్నా అబ్బాయిలు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను అయినా తట్టుకుంటారు.

   అలాగే చాలామంది మగవాళ్ళకి ఎప్పుడు ఎలా ఎవరిని సహాయం అడగాలో సరైన అవగాహన ఉండదు. కేవలం ఇదే కారణం గా ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి అవతలివారికి అవసరమైనప్పుడు మీరు ఎలా సహాయం చేస్తారో అలాగే మీకు అవసరమైనప్పుడు ఎదుటి ఎదుటివారిని సహాయం అడగడంలో మొహమాట పడకూడదు. సో,  ఈ నైపుణ్యాలని అబ్బాయిలు పెంచుకుంటే అమ్మాయిలు మీ వెనకే!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *