ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రానా, శ్రీలీల, శృతి హాసన్, మీనాక్షి చౌదరి లాంటి తారలంతా సైమా ఈవెంట్ లో సందడి చేశారు.
ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటుడు ఎవరు, నటి ఎవరు, ఉత్తమ దర్శకుడు ఎవరు.. ఇలా పలు విభాగాల్లో విజేతలు ఎవరో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
అయితే ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి దక్కబోతోంది అనే దానిపైనే అందరి చూపు. ఈ విభాగంలో అడివి శేష్- మేజర్, దుల్కర్ సల్మాన్ – సీతారామన్, నిఖిల్ – కార్తికేయ2 , సిద్ధూ జొన్నలగడ్డ – డీజే టిల్లు చిత్రాల నుంచి పోటీ పడగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్, రాంచరణ్ రేసులో కొనసాగారు. అయితే తుది విజేతగా ఎన్టీఆర్ నిలవడం విశేషం.
దీనితో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ 2023 లో విజేతగా నిలిచాడు. ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియాలో సంబరాలు చేస్తున్నారు. సైమా అవార్డ్స్ 2023లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తమ నటుడు : ఎన్టీఆర్ (RRR)
ఉత్తమ చిత్రం : సీతారామం
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (RRR)
ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా)
ఉత్తమ సహాయనటుడు : రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్ )
ఉత్తమ సంగీత దర్శకుడు : కీరవాణి (RRR)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్ (RRR)
ఉత్తమ గీత రచయిత : చంద్రబోస్ (నాటు నాటు RRR)
ఉత్తమ పరిచయ నటి : మృణాల్ ఠాకూర్ ( సీతారామం)
ఉత్తమ నటి క్రిటిక్స్ : మృణాల్ ఠాకూర్ ( సీతారామం)
ఉత్తమ నటుడు క్రిటిక్స్ : అడివిశేష్ (మేజర్ )
ఉత్తమ గాయకుడు : రామ్ మిర్యాల (డీజే టిల్లు)
ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ 2)
ఉత్తమ పరిచయ దర్శకుడు : వశిష్ఠ మల్లిడి (బింబిసార).