Surya Gochar 2023 ఈనెల 17వ తేదీ అంటే ఆదివారం నుంచి సూర్యుడు, శని గ్రహాల అశుభ కలయిక ముగియనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి.
Surya Gochar 2023 వేద జ్యోతిష్యం ప్రకారం, సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తేదీన సింహ రాశి నుంచి కన్య రాశిలోకి ఉదయం 7:11 సంచారం చేయనున్నారు. ఈ సమయాన్ని అశ్విని సంక్రాంతిగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా.. కొంతకాలంగా సూర్యుడు, శని గ్రహాలు ముఖాముఖాగా సంచారం చేస్తున్నారు. దీంతో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారిపై అశుభ ప్రభావం పడింది. ఎందుకంటే సూర్యుడు, శని గ్రహాల మధ్య శత్రుత్వం ఉంది. అయితే ప్రస్తుతం శని దృష్టి నుంచి సూర్యుడు దూరంగా వెళ్లనున్నాడు. సెప్టెంబర్ 17 నుంచి సూర్యుడు, శని గ్రహాల అశుభ కలయిక ముగియనుంది. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి…
మేష రాశి(Aries)..
సూర్యుడు, శని గ్రహాల అశుభ యోగం ముగియడంతో మేష రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. మీ జీవితంలో మంచి పురోగతిని సాధించగలరు. మీ వ్యక్తిగత జీవితంలో లక్ష్యాలను సాధించగలరు. ఈ కాలంలో మీరు సరైన పెట్టుబడి వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వారి ఆరోగ్య సంబంధిత ఆందోళనలన్నీ తొలగిపోతాయి.
Ganesh Chaturthi 2023 గణపతి పండుగ వేళ మీ రాశిని బట్టి ఈ మంత్రాలతో పఠిస్తే.. అన్నింటా విజయాలే..!
వృషభ రాశి(Taurus)..
ఈ రాశి వారికి సూర్య, శని అశుభ కలయిక ముగియడం వల్ల అన్ని రంగాల్లో మంచి అవకాశాలొస్తాయి. ఉద్యోగులకు సకాలంలో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ ఇంట్లో వనరులు పెరుగుతాయి. మీరు ఉత్తమ ఫలితాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ భాగస్వామితో కలిసి వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేయాలి. మీ జీవితంలో అన్ని రకాల ఒత్తిళ్లు తొలగిపోతాయి. మీ తోబుట్టువులు కొన్ని రకాల శుభవార్తలను వింటారు. మీకు ఎదుర్కొంటున్న సమస్యలను విజయవంతంగా పూర్తి చేస్తారు.
మిధున రాశి(Gemini)..
ఈ రాశి వారికి ఈ కాలంలో తమ కోరికలు నెరవేర్చుకునేందుకు మంచి అవకాశాలొస్తాయి. రచన, సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తులకు శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీకు విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి. ఉద్యోగులకు ఈ కాలంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కుటుంబం కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి.
Dhan Lakshmi Yoga 2023 శుక్రుని ప్రభావంతో ఈ 5 రాశులకు ధనలక్ష్మీ యోగం…!
తులా రాశి(Libra)..
ఈ రాశి వారు ఈ కాలంలో తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ అదృష్టం రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు, మీడియా రంగంలో ఉండే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
గమనిక :
ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.
Read
Latest Astrology News
and