ఆసియా గేమ్స్ ఖర్చు రూ.11 వేల కోట్లు ఒలింపిక్స్ తర్వాత అత్యధిక దేశాలు బరిలో నిలిచి పోటాపోటీగా నడిచే ఆసియా గేమ్స్‌కు రంగం సిద్ధమైంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా ఆసియా గేమ్స్ హంగామా శనివారం లాంఛనంగా మొదలవనున్నాయి. నాలుగేండ్లకోసారి జరిగే గేమ్స్ కరోనా కారణంగా ఈసారి ఏడాది ఆలస్యంగా వచ్చాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు జరిగే మెగా ఈవెంట్లో రికార్డు స్థాయి అథ్లెట్లతో బరిలోకి దిగుతున్న ఇండియా గత ఎడిషన్‌లో అత్యధికంగా గెలిచిన 70 (16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్) మెడల్స్ రికార్డును దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ గేమ్స్ కోసం స్టేడియాల నిర్మాణం, సదుపాయాలకు నిర్వాహకులు దాదాపు 11 వేల కోట్లు ఖర్చు చేశారు.
ALSO READ : రియల్ కంపెనీలపై రెరా చర్యలు
పోటీలు జరిగే మొత్తం 54 వేదికల్లో 14 వేదికలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిలో మెయిన్ సెంటర్ అయిన హాంగ్జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ (80 వేల సీటింగ్) కమలం పువ్వు విచ్చుకున్నట్టుగా నిర్మించారు. దీన్ని ‘బిగ్ లోటస్’ అని, పక్కనే ముడుచుకునే పైకప్పుతో కూడిన టెన్నిస్ కాంప్లెక్స్ (10 వేల సీటింగ్) ను ‘బిగ్ లోటస్’ అని పిలుస్తున్నారు. గేమ్స్‌లో ఈ రెండూ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
©️ VIL Media Pvt Ltd.