సమంత ప్లేస్ లో రష్మిక – ఆ డైరెక్టర్ తో శ్రీవల్లి లేడీ ఓరియెంటెడ్ మూవీ?

టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’ తో పాటు రణబీర్ కపూర్ తో కలిసి ‘యానిమల్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య టాలీవుడ్లో రష్మిక జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. యంగ్ బ్యూటీ శ్రీలీల రాకతో పూజా హెగ్డే, రష్మిక లాంటి అగ్ర కథానాయికలకు అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘పుష్ప 2’ తప్పితే రష్మికకు మరో సినిమా లేదు? అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు లో నటించే ఛాన్స్ అందుకున్నట్లు లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల్లో ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది.

నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించబోయే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో రష్మిక మెయిన్ లీడ్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘అందాల రాక్షసి’ సినిమాలో హీరోగా అలరించిన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ‘చి ల సౌ’ అనే చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుని, జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక చివరిగా నాగార్జునతో ‘మన్మధుడు 2’ సినిమాని తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు రాహుల్ రవీంద్రన్ మరే సినిమా తెరకెక్కించలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం రష్మిక తో ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించబోతున్నారట. నిజానికి రాహుల్ రవీంద్రన్ ఈ ఫిమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ని మొదట సమంత కోసం రాసుకున్నారట. సమంత రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే కదా. ఆ విధంగా సమంతకి రాహుల్ ఇదివరకే కథ వినిపించాడట. సమంతకి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చి ఓకే కూడా చెప్పిందట. కానీ తన ఆరోగ్య కారణాల రీత్యా ఈ ప్రాజెక్టు నుండి సమంతా తాజాగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో సమంత ప్లేసులో రష్మికకి ఆ అవకాశం వచ్చినట్లు సమాచారం. దీంతో సమంత ప్లేస్ ని రష్మిక రీప్లేస్ చేస్తూ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మొదటిసారి నటించబోతోందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే రష్మిక మందన్న నటిస్తున్న ఫస్ట్ ఫిమేల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసింది లేదు. సమంత మాత్రం ‘ఓ బేబీ’, ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేసింది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది. ‘ఖుషి’ తర్వాత తెలుగులో మరే ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు.

Also Read : మురుగదాస్ తో శివ కార్తికేయన్ సినిమా – మూడేళ్ళ తర్వాత మెగా ఫోన్ పట్టనున్న దర్శకుడు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *