థ్రిల్ చేసే పిండం

థ్రిల్ చేసే పిండం శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తున్న చిత్రం ‘పిండం’. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీని చూసి థ్రిల్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఈస్థాయిలో భయపెట్టిన హారర్ చిత్రాన్ని చూడలేదన్నారు.  సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు, తర్వాత ఏం జరుగుతుందన్న సస్పెన్స్‌‌తో  అద్భుతంగా రూపొందించారని టీమ్‌‌ను ప్రశంసించారు. 

డిసెంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  కంప్లీట్ హారర్ చిత్రంగా రూపొందిన ఇలాంటి చిత్రాన్ని ఇంతవరకూ చూసి  ఉండరని టీమ్ చెబుతోంది. ఈ సినిమాకి స్ర్కీన్‌‌ప్లే హైలైట్‌‌గా ఉంటుందన్నారు. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ సూరంపల్లి  సంగీతం అందిస్తున్నాడు. 

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *