చిన్న పిల్లల పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలా? బ్యాంకు రూల్స్ ఇవే.. తల్లిదండ్రులు కూడా!

Bank FD: చిన్న పిల్లల పేరుపై తల్లిదండ్రులు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ వంటివి చేసేందుకు వీలుంది. ఉన్నత చదువులు, పెళ్లి వంటి భవిష్యత్తు అవసరాలకు ఈ డిపాజిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది తల్లిదండ్రులు బ్యాంకుల్లో డబ్బులు దాస్తుంటారు. అయితే పాన్ కార్డు లేని మైనర్ పిల్లల పేరుపై డిపాజిట్లు చేయాలంటే బ్యాంకులో అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. అయితే, బ్యాంక్ ఎఫ్‌డీ లేదా ఆర్డీ అకౌంట్ తీసుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మైనర్ పిల్లల పేరుపై బ్యాంకులో ఎఫ్‌డీ ఖాతా తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. తల్లిదండ్రులకు అకౌంట్ ఉన్న బ్యాంకులోనే పిల్లల పేరుపై ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు దాదాపు అన్ని బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ముందస్తు వివరాలు తెలుసుకునే ప్రక్రియలో భాగంగా ఈ రూల్స్ అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో నవంబర్ 17, 2023 రోజున పేర్కొన్న ప్రకటన ప్రకారం.. చిన్న పిల్లల పేరుపై సేవింగ్స్ అకౌంట్ తీసుకోవాలంటే ఇప్పటికే తల్లిదండ్రులకు ఆ బ్యాంకులో పొదుపు ఖాతా కలిగి ఉండాలి. అలాగే తల్లిదండ్రులు సైతం బ్యాకింగ్ కేవైసీ నియమాలను పూర్తి చేసి ఉండాలి. అలాగే మైనర్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు అవసరమైన అధికారక గుర్తింపు పొందిన డాక్యుమెంట్లను సమర్పించాలి. ఇది బ్యాంకుల అంతర్గత పాలసీల్లోకి వస్తుందని చెప్పవచ్చు.

మైనర్ అకౌంట్

మైనర్ల పేరుపై ఖాతా తెరవాలంటే కావాల్సిన డాక్యుమెంట్లు అనేవి ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 6, 2014లో జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం.. బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనుసరించి మైనర్లు స్వతంత్రంగా ఆపరేట్ చేయగలరు అనే అంశంపై వయసు, అమౌంట్ పై లిమిట్ విధించాలి. మైనర్ల పేరుపై ఖాతా తెరిచేందుకు కావాల్సిన డాక్యుమెంట్ల విషయంలోనూ బ్యాంకులో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మైనర్ల పేరుపై తెరిచే బ్యాంక్ ఖాతాలు రెండు రకాలు ఉంటాయి. 10 ఏళ్ల పైన ఉన్న పిల్లలకు సెల్ఫ్ ఆపరేటెడ్ సేవింగ్స్ ఖాతా ఇస్తారు. అలాగే 10 ఏళ్లలోపు వయసు ఉండే పిల్లలకు ఇచ్చే ఖాతాలను తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఆపరేట్ చేస్తారు. ఈ రెండు ఖాతాలకు కేవైసీ అనేది తప్పనిసరి. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే ఎవరు ఆపరేట్ చేస్తారనేది ఉంటుంది. 10 ఏళ్లు దాటిన పిల్లలు స్వతహాగా ఆపరేట్ చేసుకునేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తాయి.

Read Latest

Business News and Telugu News

105183255

105221989

105291676

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *