3.8 కి.మీ. దూరం నుంచే..శత్రువును కాల్చిచంపిండు

3.8 కి.మీ. దూరం నుంచే..శత్రువును కాల్చిచంపిండు

 • తమ సోల్జర్‌‌‌‌ ప్రపంచ రికార్డు సృష్టించాడని ఉక్రెయిన్ ప్రకటన  
 • కీవ్‌‌: 3.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని షూట్‌‌ చేసి రికార్డ్‌‌ సృష్టించాడో ఉక్రెయిన్‌‌ స్నైపర్‌‌‌‌. ‘లార్డ్‌‌ ఆఫ్‌‌ ది హారిజన్‌‌’అనే రైఫిల్‌‌తో అతడు రష్యా సైనికుడిని కాల్చి చంపాడు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఏడాదిన్నరకు పైగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాల నుంచి వందల సంఖ్యలో సైనికులు మృతి చెందారు.

  ఈ క్రమంలో ఉక్రెయిన్‌‌ సరిహద్దుల్లో ఉన్న ఓ రష్యా సైనికుడిని 3.8 కిలోమీటర్ల  దూరం నుంచి ఉక్రెయిన్‌‌ స్నైపర్‌‌‌‌ (షార్ప్ షూటర్‌‌‌‌) షూట్‌‌ చేసి, ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2017లో ఇరాక్‌‌లో స్పెషల్‌‌ ఆపరేషన్‌‌లో భాగంగా ఓ కెనడియన్‌‌ స్నైపర్‌‌‌‌ 3.54 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువును షూట్‌‌ చేసి రికార్డు నెలకొల్పాడు. 2023లో ఉక్రెయిన్‌‌ స్నైపర్‌‌‌‌ ఆ రికార్డును బ్రేక్‌‌ చేశాడని ఉక్రెయిన్‌‌ సెక్యూరిటీ సర్వీస్‌‌ (ఎస్‌‌బీయూ) తెలిపింది. 

  ©️ VIL Media Pvt Ltd.

  Posted in Uncategorized

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *