Top Headlines Today: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్; సీఎం కేసీఆర్ కొత్త పథకం – నేటి టాప్ న్యూస్

సీఎం కేసీఆర్ కొత్త పథకం

సీఎం కేసీఆర్ ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకం ప్రకటించారు. ప్యాసింజర్ ఆటోలకు ఫిట్ నెస్, పర్మిట్ ఫీజు రద్దు చేస్తామని చెప్పారు. ఫిట్ నెస్ ఫీజు రూ.700, పర్మిట్ ఫీజు రూ.500 రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా చదవండి

చంద్రబాబుకు భారీ ఊరట- స్కిల్ స్కామ్ కేసులో బెయిల్

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంకా చదవండి

‘ప్రమాద స్థలానికి సీఎం జగన్ రావాల్సిందే’ – విశాఖ హార్బర్ వద్ద మత్స్యకారుల నిరసన, ఉద్రిక్తత

విశాఖ ఫిషింగ్ హార్బర్ (Visakha Fishing harbor) ప్రమాదంపై మత్స్యకారులు (Fishermen) తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు కాలిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కో బోటు ఖరీదు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉంటుందని రూ.కోట్లల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదాలు చూడలేదని చెప్పారు. ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ గేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం జగన్ (CM Jagan) సందర్శించి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత్స్యకారులకు సద్ది చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని మంత్రి సీదిరి అప్పలరాజును ఆదేశించారు. ఇంకా చదవండి

కాంగ్రెస్‌లో పెరుగుతున్న సీఎం పంచాయతీ – గాల్లో మేఘాలు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకుంటున్నారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అంతర్గత రాజకీయాలకు ముద్దుగా అంతర్గత ప్రజాస్వామ్యం అని  పేరు పెట్టుకుంటారు. అంటే ఎవరికి వారు గ్రూపులను మెయిన్ టెయిన్ చేయడమే కాదు  చాన్స్  వస్తే తాము పీసీసీ చీఫ్ ( PCC ) అని లేదా ముఖ్యమంత్రి అని ప్రకటనలు చేసేసుకుంటూ ఉంటారు. వీరి తీరు చూసి ఇతర పార్టీలు.. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆరు నెలలకో సీఎం వస్తారని అలాంటి పార్టీ మనకు అవసరమా అని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.  పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి సారించాల్సిన నేతలు.. తామే ముఖ్యమంత్రి ( Congress CM )   అవుతామన్న ప్రకటనలు చేసుకుంటూ ప్రత్యర్థులకు చాన్సిస్తారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇదే పరిస్థితా అని ఓటర్లకూ అనుమానం కలిగేలా చేస్తున్నారు. ఇంకా చదవండి

కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెంచడానికే ప్రాధాన్యం – మేనిఫెస్టోకూ ప్రచారం తక్కువే ! బీఆర్ఎస్ ప్లానేంటి?

భారత రాష్ట్ర సమితి ప్రచార సరళి పూర్తిగా కాంగ్రెస్ సెంట్రిక్ గా ( Congress ) సాగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా ఎవరు ఆ పార్టీ కోసం ప్రచారం చేసినా.. ప్రసంగాల్లో ప్రధానంగా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే  జరగకూడనివి జరిగిపోతాయని.. అలాంటి రిస్క్ తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నరు. చివరికి ప్రచార చిత్రాల్లో కూడా అదే చెబుతున్నారు.రిస్క్ వద్ద కారు గుర్తుకు ( Car Symbol ) గుద్దు అని చెబుతున్నారు.  బీఆర్ఎస్ ప్రచార వ్యూహం ఎలా ఉందంటే.. చివరికి సొంత పార్టీ మేనిఫెస్టో ( BRS Manifesto )  గురించి ఆ పార్టీ నేతలు సభల్లో ఎక్కువగా ప్రచారం చేయడం లేదు. కాంగ్రెస్ వస్తే ఇప్పుడు వచ్చేవన్నీ ఆగిపోతాయని చెబుతున్నారు. ఇలా పూర్తిగా ఎందుకు కాంగ్రెస్ చుట్టూనే ప్రచారాన్ని తిప్పుతున్నారన్నది బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలకూ అంతుబట్టకుండా ఉంది. ఇంకా చదవండి

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *